ర్యాంకుల పరిమితి విధించే ఆలోచన లేదు : కడియం
హైదరాబాద్, ఫిబ్రవరి 11: విద్యార్ధుల ఫీజు రీఎంబర్స్‌మెంట్ అంశమై తెలంగాణ కేబినెట్ సబ్‌కమిటీ బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్ మార్గదర్శకాలు, ఫీజుల విధివిధానాలు, కేజీ టూ పీజీ విద్యపై చర్చించారు. సమావేశం అనంతరం విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. వారంలోగా ఫీజు రీఎంబర్స్‌మెంట్ మార్గదర్శకాలు ఖరారు చేస్తామన్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లింపుల్లో ర్యాంకుల పరిమితి విధించే ఆలోచన లేదని మంత్రి స్పష్టం చేశారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ఓ 371డి ప్రధానమైన అంశమన్నారు. పక్కా ప్రణాళికతో కేజీ టూ పీజీ విద్య తీసుకోస్తామని చెప్పారు. కేజీ టూ పీజీపై ఈ నెల 15న నిపుణులతో సమావేశమవుతామన్నారు. అదేవిధంగా రెండు మూడు రోజుల్లో మరోసారి సబ్‌కమిటీ భేటీ అవుతుందని కడియం తెలిపారు.




