వాళ్ళ పాలనలో ఏడాదికి 1000 ఉద్యోగాలే..
మా పాలనలో ఏడాదికి 13వేల చొప్పున ఉద్యోగాలు ఇచ్చాం
మంత్రి కేటిఆర్ వెల్లడి
మాకంటే వేగంగా ఉద్యోగ నియామకాలు ఎవరైనా చేశారా?
హైదరాబాద్ : కాంగ్రెస్ పదేండ్ల పాలనలో తెలంగాణలో ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని, తెలంగాణలో మాత్రం తొమ్మిదిన్నరేండ్లలో లక్ష 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మరో 90 వేల ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని, ఇప్పుడు 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఉన్నాయని చెప్పారు. మోదీ ఇస్తానన్న ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు