వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత ఫెదరర్
వింబుల్డన్: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ విజయకేతనం ఎగుర వేశాడు. ఆదివారం ఆండీ ముర్రేతో జరిగిన హోరాహారీ ఫైనల్‌్‌లో రోజర్ విజయఢంకా మోగించాడు. దీంతో ఫెదరర్ 7 వింబుల్డన్‌లను గెలిచిన పీట్ సంప్రాస్ రికార్డును సమం చేశాడు. ఓవరాల్‌గా అతనికి ఇది 17వ గ్రాండ్‌స్లావమ్ టైటిల్. అంతకు ముందు మ్యాచ్‌లో మొదటి సెట్‌ను 6-4తో ముర్రే సొంతం చేసుకోగా, రెండో సెట్‌ను ఫెదరర్ 7-5 కైవసం చేసుకున్నాడు. మూడో సెట్ పోటాపోటీగా సాగుతుండగా వర్షం మధ్యలో అంతరాయం కల్గించింది. కాసేపు విరామం తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అనంతరం హోరాహోరీగా సాగిన మూడు నాల్గు సెట్లను 6-3, 6-4 తో ఫెదరర్ గెల్చుకొని వింబుల్డన్ విజేతగా నిల్చాడు. అంతేకాదు రెండేళ్ల క్రితం తాను కోల్పోయిన నెంబర్ వన్ ర్యాంకును తిరిగి పొందాడు.