విఆర్ఓలకు వీధులు-బాధ్యతలు ఇచ్చి రెవెన్యూలోనే రీ-లోకెట్ చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెంబర్ 29ను రద్దు చేసి విఆర్ఓల జాబ్ చార్జింగ్ రద్దు పరిచి రెండు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ స్పష్టమైన వీధులు బాధ్యతలు ఇవ్వకపోవడంవలన మానసికంగా ఆందోళన చెందుతున్నారు.జిల్లాలో అధికారులు తిరిగి విఆర్వోలకు ప్రభుత్వం రద్దు చేయబడిన విఆర్వోల విధులు బాధ్యతలు అప్పజెపుతున్నారు వారి ఒత్తిడికి విధులు నిర్వహిస్తున్నారు.ప్రభుత్వం జాబ్ చార్ట్ నేటికి ఇవ్వకపోవడం వలన అభద్రతతో ఉన్నాము. మాకు సర్వీస్ పరమైన హక్కులను కోల్పోతున్నాము.సామాజిక పరమైన తీవ్ర నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. మేము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర విఆర్వోల కమిటీ తలపెట్టిన శాంతియుత ఆందోళనలలో బాగంగా మండల విఆర్వోలు కలిసి సోమవారం రోజున మండల తహశీల్దార్ పవన్ చంద్రకు వారి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే విఆర్వోలకు స్పస్టమైన విధులు-బాధ్యతలు జాబ్ చార్ట్ అప్పగించాలని, విఆర్వో లను రెవెన్యూ శాఖలొనే “రీ లొకెట్”చేయాలని,పదోన్నతులు కల్పించి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని అకాల మరణం చెందిన కుటుంబాలల్లో కారుణ్య నియమాలను చేపట్టాలని వివిధ కారణంగా సస్పెండ్ అయిన వారికి పోస్టింగ్ ఇవ్వాలని,సర్వీస్ రెగులర్ కాని వారికి రెగ్యులరైజ్ చేయాలి,ఇతర జిల్లాలల్లో ఉండిపోయిన వారికి సొంత జిల్లాలో బదిలీ చేస్తూ స్ఫౌజ్ మెడికల్ ఒంటరి మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ పరస్పర బదిలీలు కౌన్సెలింగ్ పద్ధతిలో బదిలీలు చేయాలని,మా దీర్ఘకాలిక సమస్యలు పరిస్కారం చేయకపోవడం వల్ల ఆర్థిక సామాజిక పరంగా తీవ్రమైన నష్టాన్ని అనుభవిస్తు మేము మానసిక క్షోభకు గురవుతు అవమాన భారంతో మానసికంగా కృంగి పోతు�