వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కేరెల్లి బచారం బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని లారీ ఆటో ఢీ
రోడ్డు ప్రమాదం పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి…
ప్రమాదంపై అరా….
కలెక్టర్,ఎస్పీ లతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్య అందించాలని ఆదేశం.
వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని కేరెళ్లి – బాచారం వద్ద ఆటోను లారీ ఢీ కొన్న సంఘటనలో నలుగురి మృతి పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.ప్రమాద విషయం తెలిసిన వెంటనే వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల గారు,ఎస్ పి కోటిరెడ్డి గార్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
పెద్దేముల్ మండలం మదనంతాపూర్ తండాకు చెందిన వ్యక్తులు ఆటో లో వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా,మరొకరు ఆస్పత్రిలో మృతి చెందగా పలువురు గాయపడటం బాధాకరమని అన్నారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మంత్రి కోరుకున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.