వికారాబాద్ వడ్డెర యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా విఠలాపూర్ రాజు ఎన్నిక
తెలంగాణ వడ్డెర యువజన సంఘం వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చౌడపూర్ మండల కేంద్రానికి చెందిన విఠలాపూర్ గ్రామానికి చెందిన జరుపటి రాజును తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాజు మాట్లాడుతూ వడ్డెర సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర మహిళా అధ్యక్షురాలు ఉమా,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏత్తూరి గణేష్,రాష్ట్ర ఉపాధ్యక్షులు పులి శ్రీనివాస్,వికారాబాద్ జిల్లా అధ్యక్షులు దొంగల సత్యనారాయణ,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వెంకటరమణ,దోమ మండల అధ్యక్షులు వెంకటరమణ,పరిగి నియోజకవర్గ అధ్యక్షులు ముద్దంగుల సారంగి మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.