పవన్‌కు తిట్టడమే తెలుసని ఎద్దేవా
విజయనగరం,జూన్4(జనం సాక్షి): విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. జమ్మాదేవిపేటలో రచ్చబండ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రులను ప్రధాని మోదీ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీల రాజీనామాల డ్రామాను ప్రజలు అర్ధం చేసుకున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్ తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతకు ముందు లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు వీధుల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో వీధుల్లో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జమ్మాదేవిపేటలో గ్రామదర్శిని కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఆపై ఎస్.కోటలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రచ్చబండ కార్యక్రమంలో విూడియాను అనుమతించని డిపిఆర్‌ఓ, విూడియాను పరిసరప్రాంతలలో పోలీసులు అనుమతించడంలేదు.




