Tuesday, 3 November 2026

విజయవంతంగా సుష్మా కిడ్నీ మార్పిడి

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఢిల్లీ ఎయిExternal Affairs Minister Sushma Swaraj shakes hands with her Sri Lankan counterpart GL Peiris during a meeting in New Delhi on July 11, 2014. (Photo: IANS)మ్స్ కార్డియో థొరాసిక్ సెంటర్‌లో సుమారు 5 గంటలపాటు చికిత్స సాగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన చికిత్స మధ్యాహ్నం రెండున్నర దాకా సాగింది. ఈ చికిత్స నిర్వహించిన డాక్టర్ల బృందంలో ఎయిమ్స్ డైరక్టర్ ఎంసీ మిశ్రా, నెఫ్రాలజిస్ట్ సందీప్ మహాజన్, సర్జన్లు వికె బన్సల్, వి.శీను ఉన్నారు. ఈ నెల 7న ఆమె ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. సుష్మాకు కిడ్నీ ఇస్తామంటూ అనేకమంది ముందుకు వచ్చారు. అయితే దాత ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *