విజయవంతమైన ఉచిత వైద్యశిబిరం

💥 ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త💥

అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఉప్పల్, రామంతపూర్ లోని నల్ల పోచమ్మ తల్లి గుడి దగ్గర ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ మరియు IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, IVF నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు…

అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా మరియు ట్రై కలర్ హాస్పిటల్ TRI COLOUR ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శిబిరం అనూహ్య స్పందనతో మద్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఇందులో చాలా మంది ఉచిత ఆరోగ్య పరీక్షలు , వైద్యసేవలు వినియోగించుకున్నారు. షుగర్, బి.పి., థైరాయిడ్ వ్యాధులకు ఉచితముగా పరీక్షలునిర్వహించి రోగనిర్ధారణ వైద్యబృందంతో నిర్వహించారు.ఈ శిబిరంలో ఆరోగ్య సలహాలు సూచనలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది.

తదనంతరం ఈ సందర్భంగా.. టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో షుగర్, బి.పి.థైరాయిడ్ వంటి జబ్బులు ఎక్కువగా ప్రబలుతున్నాయి. ప్రతీరోజు శారీరకశ్రమ,వ్యాయామం,నడక చేస్తూ ఆరోగ్య, ఆహార నియమాలను పాటిస్తూ జీవనశైలిలో మార్పు చేసుకోవడం వలన ఆనందమయ జీవనము కొనసాగించాలని అన్నారు. ఈ రోజుల్లో ఖరీదైన వైద్యపరీక్షలు, వైద్యసేవలు ఉచితంగా అందజేసిన ట్రై కలర్ హాస్పిటల్ వారిని, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా వారిని లబ్ధిదారులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంభు పాండయ్య గుప్త, మేడ్చల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రమేష్ గుప్తా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్, ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ బోనగిరి శ్రీనివాసులు గుప్త,అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ యూత్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేష్ గుప్తా, ట్రెజరర్ బోనగిరి శ్రవన్ గుప్త, ఉప ట్రెసరర్ వూరే నగేష్ గుప్త, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా సభ్యులు, నాయకులు,వైద్య సిబ్బంది ,ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.