Wednesday, 4 November 2026

విజయవాడలో ఎన్టీఆర్‌ విగ్రహానికి బాబు నివాళి

విజయవాడ,మే28( జ‌నం సాక్షి ):  ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ పటమటలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి మహానాడు ప్రాంగణానికి బయలుదేరిన చంద్రబాబు.. పటమటలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. అనంతరం మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్‌, ఇతర నేతలు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఎపి విడివడ్డ తరవాత చంద్రబాబు విజయవాడలోనే నివాళి అర్పిస్తున్నారు.