విజయవాడలో విషాదం
విజయవాడ : కోర్టులు చెప్పినా.. ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా దొరకడం లేదు. విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులైన ఇద్దరు వృద్ధ దంపతులు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు వెంకటనారాయణశర్మ, సుందరిగా గుర్తించారు. అగ్రిగోల్డ్ దెబ్బకు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ దంపతులు కేన్సర్‌కు గురైన తమ కుమారుడికి వైద్యం చేయించుకోలేసి స్ధితిలో ఉన్నారని తెలుస్తోంది. అందుకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం