విజయసాయి రాజకీయ విమర్శలు దారుణం: వెలగపూడి
విశాఖపట్నం,మే9(జనం సాక్షి): వంగవీటి రంగా హత్య కేసులో తాను ఉన్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీడీపీ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. అలాగే తనపై కేసులున్నాయని నిరూపించకపోతే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. ఈనెల 22న ధర్మ పోరాట దీక్ష విజయవంతం కావాలని కోరుతూ పోలమాంబ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా ఇవ్వాలని, 19 విభజన హావిూలను అమలు చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు డిమాండ్ చేశారు. వైకాపా విభజన సమస్యలపై రాజకీయం చేస్తోందన్నారు. విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని అన్నారు.