– కూకట్‌పల్లిలో రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన బస్సు
– విద్యార్ధిని మృతితో బస్సు అద్దాలు ధ్వసం చేసిన విద్యార్థులు
హైదరాబాద్, అక్టోబర్29(జనంసాక్షి) : ఓ ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థిని మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. జగద్గిరిగుట్టలో నివసించే రమ్య కూకట్‌పల్లిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం ఇంటి నుంచి కళాశాలకు బయలుదేరిన రమ్య.. కూకట్‌పల్లి బస్టాప్‌లో దిగి జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతున్న రమ్యను అదే కళాశాలకు చెందిన బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో రమ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్ల ముందే ప్రమాదం జరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థులు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్ర ఈ మాదం
జరిగిందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఘటనతో కూకట్‌పల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రాఫిక్ భారీగా స్తంభించింది. విద్యార్థినిని బలిగొన్న బస్సు అద్దాలను ధ్వంసం చేసిన తోటి విద్యార్థులు దాన్ని రోడ్డువిూదే నిలిపివేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 10 బస్సులను విద్యార్థులు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అంతా స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మృతి చెందిన విద్యార్థినిని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థినిని బలితీసుకున్న.. కళాశాల బస్సు




