విద్యార్థి కుటుంబాన్ని పరామర్శ.

ఎంపీపీ ఎస్ ప్రధానోపాధ్యాయుడు చౌహన్ శ్రీనివాస్.

జనం సాక్షి ఉట్నూర్.

నార్నూర్ మండలంలోని ఖంపూర్ గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాల ఇద్దరి విద్యార్థి తండ్రి బట్లడే గణేష్ గత రెండు రోజుల క్రితం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చౌహాన్ శ్రీనివాస్ శనివారం విద్యార్థుల ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబానికి 25 కిలోల బియ్యం నిత్యవసర సరుకుల తో పాటు 2500 వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. బట్లాడే గణేష్ ఇద్దరు కుమారైలు ఎంపీపీ ఎస్ పాఠశాలలో చదువుతున్నరని ఆ ఇద్దరు విద్యార్థులపై విద్యపై పూర్తి శ్రద్ధ వహిస్తారని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆనంద్ రావు గ్రామ సెక్రెటరీ కాశీరాం పాఠశాల విద్యా సంఘం చైర్మన్ కేశవ్ గ్రామ యూత్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మారుతి తదితరులు ఉన్నారు.