స్టూడెంట్ కౌన్సిలర్స్ ట్రైనింగ్ కార్యక్రమంలో సబిత
హైదరాబాద్,నవంబరు19(జనం సాక్షి): ప్రతి విద్యార్థిపై వ్యక్తిగతంగా శ్రద్ద పెట్టకపోయినా విద్యార్థులను తీర్చిదిద్దే కార్యక్రమంలో లెక్చరర్లు కీలక పాత్ర పోషించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఇంటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల స్టూడెంట్ కౌన్సిలర్స్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ పిన్సిపల్ సెక్రటరీ జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కమిషనర్ ఓమర్ జలీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. ఇది చాలా మంచి కార్యక్రమం.. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు, కౌన్సిలర్స్‌గా పని చేయడానికి ముందుకు వచ్చిన లెక్చరర్స్‌కు అభినందనలు తెలిపారు. కౌన్సిలర్స్ చాలా బాధ్యతగా ఉండాలి. కళాశాలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో ఇంటర్‌బోర్డులో జరిగిన ఘటనలు పునరావృతం కావొద్దని సీఎం కేసీఆర్ చెప్పారు. విద్యార్థుల పట్ల లెక్చరర్స్ మంచిగా మెలిగి.. వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని మంత్రి సబిత సూచించారు.




