విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం కి పట్టవా

కడెం జూన్18 (జనం సాక్షి)వి ద్యార్థుల సమస్యలు తెలుసుకొని, భరోసా కల్పించేందుకు బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి ని పోలీస్ లు అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అని
ఖానాపూర్ నియోజకవర్గం నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డి అన్నారు
శనివారం హరిత హోటల్ లో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ
IIIT లో విద్యార్థులు చాలా రోజుల నుండి సమస్యలు పడుతున్నారు వారి సమస్యలు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ప్రభుత్వం కి ఎన్నో సార్లు చెప్పిన కూడా కనీసం వారిని పట్టించుకోలేదని వారి సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన pcc అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని అడ్డుకోవడం సరైన తీరు కాదని వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళకి సరిపడే బోధకుల ని నియమించాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ తరుపున విద్యార్థుల సమస్యలు కోసం రోడ్డు ఎక్కి నిరసనలు ధర్నా లు చేస్తామని ప్రభుత్వం ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమం లో యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు బి రమేష్ జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్ రఫీక్ మైనారిటీ మండల అధ్యక్షులు బబ్లు నాయకులు రహీమ్. రమేష్. సలీం.శ్రీకాంత్. హన్మాండ్లు. సత్యం చారి. క్రాంతి. రాజన్న. శ్రీనివాస్ బ్రహ్మ చారి తదితరులు ఉన్నారు