హైదరాబాద్,మే4(జనం సాక్షి): ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా అనేకచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలడం, వైర్లు తెగిపడడం వంటి కారణాల వల్ల విద్యుత్ సంథకు భారీగానే నస్టం వాటిల్లింది. చూస్తుండగానే పెద్దఎత్తున ఈదురుగాలులు గంటకు సుమారు 40 నుంచి 50 కిలోవిూటర్ల వేగంతో దూసుకొచ్చాయి. గాలులతో పాటే వాన కుమ్మేసింది. ఓ పక్క ఉరుములు.. మరో పక్క పిడుగులు. చెట్లు నేల కూలాయి. గోడలు కూలిపోయాయి. కరంటు స్తంభాలు.. ¬ర్డింగులు పడిపోయాయి.. కేవలం మూడు నాలుగు గంటల వ్యవధిలో గాలి.. వాన కలిసి రాష్ట్రంలో బీభత్సాన్ని సృష్టించాయి. దీంతో అనేకచోట్ల చీకట్లు అలముకున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలోనూ ఇదే పరిస్థితి. విద్యుత్ పునరుద్దరణ సాగుతోంది. పలుజిల్లాల్లో ఇంకా చీకట్లు తొలగలేదు. సుమారు 1250 విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటలపాటు కరంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాల్లో మంత్రులు పరిస్థితిని మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు. విద్యుత్ పునరుద్దరణకు చర్యలు తీసుకుంటున్నారు. ఈదురుగాలుల వల్ల నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పలు చోట్ల విద్యుత్తు తీగలు తెగిపోయాయి. దీంతో జిల్లా అంతటా విద్యుత్తు అంతరాయాలు కలిగాయి. నల్గొండలో భారీ వృక్షాలు కూలి విద్యుత్తు తీగలపై పడ్డాయి. కారణంగా 10 ఉపకేంద్రాలకు సరఫరా నిలిచిపోగా.. అన్ని
కేంద్రాలకు ముందస్తుగా సరఫరా నిలిపేశారు. సూర్యాపేట, నల్గొండ, కోదాడ, మిర్యాలగూడ పట్టణాల్లో అయిదు గంటలకుపైగా సరఫరా నిలిచింది. పెన్‌పహాడ్, గరిడేపల్లి, హుజూర్‌నగర్, మోతె తదితర అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి. రెండు జిల్లాలో కలిపి 100కు పైగా స్తంభాలు కూలినట్లు అధికారులకు ప్రాథమిక సమాచారం అందింది. వరంగల్, హన్మకొండలోని అనేక చోట్ల విద్యుత్తు స్తంభాలు విరిగిపడడంతో సరఫరా నిలిచిపోయింది. రాత్రి వరకు కరెంట్ పునరుద్ధరణ కాలేదు. అప్రమత్తమైన బల్దియా యంత్రాంగం రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొంది. కరీంనగర్ జిల్లా పరిధిలో 15 విద్యుత్తు స్తంభాలు నేల కూలినట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. ఎల్లారెడ్డిపేట మండల మెట్‌పల్లి మండలంలో ఆత్మకూర్‌లో విరిగిన విద్యుత్తు స్తంభాలతో జనాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు పట్టణంతో పాటు గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. 11 కేవీ విద్యుత్తు తీగలు పూర్తిగా తెగిపడ్డాయి. వీలైన చోట్ల వాటిని పునరుద్ధరించే పనిలో సిబ్బంది ఉన్నారు. విద్యుత్తు నష్టం లేకుండా చూసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ముందస్తు చర్యల చేపట్టాలని సూచించారు.
విద్యుత్ సంస్థకు భారీగా నష్టం




