ఒంగోలు: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరులో విషాదం నెలకొంది. పొలంలో విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు రైతులు మృతి చెందారు. మృతులు గొబ్బూరుకు చెందిన అనిల్, నాగిరెడ్డిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.