రేవంత్ చిల్లర రాజకీయ నాయకుడు
హైదరాబాద్,ఆగస్ట్3(జనం సాక్షి): రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతూ రాజకీయంగా ఎదిగారని, ఇది ప్రపంచానికి తెలిసిన విషయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. రేవంత్ నాలుగు పార్టీలు మారలేదా అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ª`ని వాడుకొని ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నదని నిజం కాదా అని ఘాటుగా విమర్శించారు. రేపు మునుగోడులో జరిగే ఉప ఎన్ని వ్యక్తులో లేదా పార్టీల మధ్యో కాదని, అది కెసిఆర్ అహంకారానికి,ప్రజలకు మధ్య జరుగుతుందని అన్నారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో విూడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు దొందు దొందేనని.. వాళ్లు కలిసే పని చేస్తున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. అప్పుడు ఏమయ్యారని అన్నారు. రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ విమర్శలు చేయడం సబబు కాదన్నారు. మాతో ఎమ్మల్యేలంతా టచ్‌లో ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలోకి రావాలని ఆనాడే రాజగోపాల్ రెడ్డిని అడిగినట్లు.. కానీ దానికి ఆయన ఒప్పుకోలేద న్నారు. మునుగోడులో జరిగే ఎన్నికలు వ్యక్తుల మధ్య జరగడం లేదని, కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం కోసమే తాము పని చేయడం జరుగుతుందని ఆనాడు ఆయన స్పష్టం చేశారన్నారు. కాంట్రాక్టు రద్దు చేసినా.. ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా కట్టుబడి పని చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని తెలిపారు. వాస్తవానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించబోతోందన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ..ఇలా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందా అని నిలదీశారు. ముఖ్యమంత్రులను అవమానించిన పార్టీ ఏదైనా ఉందంటే.. అది కాంగ్రెస్సేనని విమర్శించారు. మహారాష్ట్రలో సిద్దాంతాన్ని పక్కన పెట్టి.. శివసేన, ఎన్సీపీ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పొత్తుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని, ఏక్ నాథ్ షిండే తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వర్తించడం జరిగిందన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో కేవలం రెండు స్థానాలకు పార్టీ పరిమితమైందని, అక్కడ రాహుల్ ను ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. కేరళకు వెళ్లి ఎంపీ అయ్యారనే విషయాన్ని ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు నిధులున్నాయా ఉత్సవ విగ్రహాలుగా మారారని వ్యాఖ్యానించడం తప్పా అని నిలదీశారు. టీఆర్‌ఎస్ కు తామే ప్రత్యామ్నాయం తామేనంటూ.. కాంగ్రెస్ గొప్పలు చెప్పుకొంటోందన్నారు. ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుని… పోటీ చేసిన రాష్టాల్ల్రో టీఆర్‌ఎస్ సహకరించ లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసి పని చేయలేదా, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అదే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఇవన్నీ మరచిపోయి
ఇప్పుడు బిజెపిని విమర్శించడం తగదన్నారు. బిజెపి ఓ సిద్దాంతంకోసం పనిచేస్తుందన్నారు.