విధులు బహిష్కరించిన పోస్టల్‌ ఉద్యోగులు

  విజయనగరం,మే24(జ‌నం సాక్షి):  పోస్టల్‌ డాక్‌సేవక్‌ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని, ఉద్యోగులందరికీ వేతనాలు పెంచాలని, కమలేష్‌ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ పోస్టల్‌ ఉద్యోగులు గురువారం నిరవధిక సమ్మెలో భాగంగా మూడో రోజు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా పోస్టల్‌ ప్రధాన కార్యాలయం నుంచి ర్యాలీ కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కమలేష్‌ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్‌ చేశారు.