Tuesday, 3 November 2026

వినియోగదారుపై పిజ్జా డెలివరీ బాయ్‌ దాడి

ముంబయి: ఫోన్‌లో అర్డర్‌ చేసిన పిజ్జా అందజేయడానికి వినియోగదారు ఇంటికి వెళ్లిన ఒక డెలివరీ బాయ్‌ ఇంట్లో యువతి ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఆమెపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ప్రతిఘటించిన ఆమెను కత్తితో గాయపరిచాడు. ఆమె కేకలకు చుట్టుపక్కలవారు రావడంతో పారిపోయాడు. వర్లి ప్రాంతానికి చెందిన ఒక యువతి చొవిసన్‌ పిజ్జా సెంటర్‌నుంచి పిజ్జా తెప్పించుకుంది. అది డెలివరీ చేసేటపుడు ఇంట్లో ఆమె ఒక్కతే ఉన్నట్లు గమనించిన డెలివరీ   బాయ్‌ కాసేపటికి మళ్లీ వచ్చి తలుపుతట్టాడు. తాను సరైన పిజ్జా ఇచ్చిందీ లేనిదీ చూడాలంటూ వంటగదిలోకి వెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించగా ఎదురు తిరిగినందుకు చాకుతో పలుచోట్ల గాయపరిచాడు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిజ్జా కేంద్రం యజమాని సహకారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *