Monday, 2 November 2026

విపక్షం లేకుండానే సభ..

2హైదరాబాద్ : విపక్షం లేకుండానే నేడు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రారంభం కానుంది. శాసనసభలో సోమవారం 29 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఒక రోజు కాదు..ఏకంగా ఈ సమావేశాలు ముగిసే వరకు అంటే ఈనెల 10వ తేదీ వరకు అడుగు పెట్టవద్దని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు పెరుగుతున్నాయి. నేడు ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద ధర్నాకు దిగే అవకాశాలున్నాయి. పునరాలోచన చేయాలని సూచనలు అందుతున్నాయి.
సస్పెండ్ చేయలేదు కనుక ఎర్రబెల్లి..జానారెడ్డిలు స్పీకర్ ను కోరే అవకాశం ఉంది. స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నేడు పలు అంశాలపై చర్చ జరుగనుంది. గ్రామజ్యోతి, వాటర్ గ్రిడ్, వ్యాట్ బిల్లు తదితర అంశాలపై చర్చ జరుగనుంది. 26 గ్రిడ్ లకు 19 గ్రిడ్ లకు టెండర్లు పిలిచారు. వీటిపై నెలకొన్న సందేహాలకు ప్రభుత్వం సమాధానం చెప్పనుంది. వాటర్ గ్రిడ్ నిర్వాహణ ఎలా ఉండబోతోంది. తాగు..సాగు నీరు ఎలా ఉండనుంది తదితర విషయాలపై సర్కార్ క్లారిటీ ఇవ్వనుంది. మన ఊరు మన ప్రణాళికను గ్రామజ్యోతికి అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 50 లక్షల నుండి 2 కోట్ల వరకు నిధులు సమకూర్చనుంది. నిధులు ఎలా ఉన్నాయి ? ఎంత కేటాయించారు ? దీని ఉద్ధేశ్యం ఏంటనే దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *