సోనియాకు మోడీ బర్త్‌డే విషెస్‌

న్యూఢిల్లీ,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా నేతలు ఆమెకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుతూ, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన ఇచ్చిన ఓ ట్వీట్‌లో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆమె ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు. ఇదిలావుండగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఓ ట్వీట్‌లో సోనియా గాంధీ తరతరాల కాంగ్రెస్‌ నేతలకు స్ఫూర్తినిచ్చారని పేర్కొంది. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని నిర్వహించిన ఆమె తమను సమైక్యపరిచారని తెలిపింది.