వివక్ష లేని సమానత్వపు సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డ్రీమ్ హోమ్స్ అండ్ డిజైనర్ ముహమ్మద్ ఫయాజ్

 కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో మంగళవారం నాడు డ్రీమ్ హోమ్స్ అండ్ డిజైనర్ ముహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు భారత రాజ్యాంగ నిర్మాత తన జీవితాంతం అంటరానితనాన్ని ఎదిరించిన యోధుడు ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం విశ్వరత్న బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు అంటరానితనం వివక్షలపై అలుపెరుగని పోరు చేసిన దళిత బహుజన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయులు ఆదిపత్య ధోరణులకు వివక్షకు తావివ్వకుండా  సమస్త మానవులు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో పరస్పర గౌరవంతో  పరోపకారం ఫరిడవిల్లెలా కలిసి మెలిసి జీవించాలనే వసుదైక కుటుంబ దృక్పథాన్ని రాజ్యాంగం  ద్వారా పౌర  సమాజానికి అందించిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆ మహానుభావుడు జాతికి చేసిన సేవలను స్మరించుకుంటూ వారికి ఇవే మా ఘన నివాళులు అని డ్రీమ్ హోమ్స్ అండ్ డిజైనర్ ముహమ్మద్ ఫయాజ్ ఒక ప్రకటనలో  తెలిపారు