విశాఖపట్నం: కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమాలో వివాదాస్పద సీన్లు లేవని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. ఈ సినిమాపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఆయన విశాఖ విమ్యాక్స్ ధియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శిన వేయించుకొని సినిమాను తిలకించారు. అనంతరం మాట్లాడుతూ సినిమాలో ఎక్కడా తెలంగాణవాదులను కించపర్చే అంశలు లేవన్నారు. దీనిపై లేనిపోని రాద్థాంతం చేయడం సమంజనం కాదని అన్నారు. దర్శక నిర్మాతలు, తెలంగాణ పంపిణీదారుల ఇళ్లపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్చలు తీసుకుంటామన్నారు.




