పోలీస్ కేసు నమోదు
హైదరాబాద్,మే30(జనం సాక్షి): కూలి పనులు చేసుకునేందుకు వచ్చిన ఓ వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొందరు నగరంలోని మౌలాలి శ్రామిక్‌నగర్, గాంధీనగర్‌కు వచ్చి కూలీలుగా, మేస్త్రీలుగా పనులు చేసుకుంటున్నారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా మాధవనగర్‌కు చెందిన దారిమెళ్ల మొగిలి (30) ఓ వివాహితతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె భర్త లేని సమయంలో ఇంటికి వెళ్లి దగ్గర చేసుకొని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఆమె భర్తకు తెలియడంతో మొగిలి విషయం ఎవరికైనా చెబితే నీ పరువే పోతుందని, చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో బాధితురాలు మల్కాజిగిరి పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్ కొమురయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహితపై అత్యాచారం




