Tuesday, 3 November 2026

విశాఖ వేదికగా సిఐటియూ సమావేశాలు

విశాఖపట్టణం,నవంబర్‌1(జ‌నంసాక్షి): సిఐటియు అఖిల భారత వర్కింగ్‌ కమిటీ సమావేశాలు విశాఖపట్నంలోని స్టీల్‌ప్లాంట్‌ ప్రాంగణంలో గురువారం ప్రారంభమైయ్యాయి. 3వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాలను ఉదయం సిఐటియు అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు కె. హేమలత, తపన్‌సేన్‌, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు సిహెచ్‌. నర్సింగరావు, ఎంఎ.గఫూర్‌ సిఐటియు పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న స్టీల్‌, కోల్‌, పెట్రోలియం, షిప్‌యార్డు వంటి ప్రభుత్వరంగ సంస్థల్లోని కార్మిక సంఘాల నేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు. మధ్యాహ్నం 4 గంటలకు జింక్‌ పరిశ్రమ నుండి ర్యాలీగా బయలుదేరి గాజువాకలోని లంకా గ్రౌండ్సుకు చేరుకున్నారు. అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దేశంలోని కార్మికవర్గంపై మోడీ ప్రభుత్వం జరుపుతున్న దాడిని, కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టేందుకు ఈ సభల్లో కార్యాచరణ రూపొందించుకోనున్నారు.