Monday, 2 November 2026

విష్ణు వీరంగం..మా జోలికొస్తే చంపేస్తాం..

ప్రైవేటు గుండాలతో స్వైర విహారం
నిరసన తెలిపిన బ్రాహ్మణులపై విచక్షణా రహితంగా దాడి
ఒకరి పరిస్థితి విషమం, పలువురికి గాయాలు
హైదరాబాద్, అక్టోబర్‌ 31(జనంసాక్షి): మంచు హీరో విష్ణు వీరంగం సృష్టించాడు..మా జోలికొస్తే చంపేస్తాం అంటూ తన ప్రైవేటు సైన్యంతో స్వైర విహారం సృష్టించాడు..రీల్‌ లైఫ్‌ సీన్‌ని రియల్‌ లైఫ్‌లోకి తెచ్చి హీరోయిజం చూపించాలనుకున్నాడు..విష్ణు హీరోగా నటించిన దేనికైనా రెడీ చిత్రంలో బ్రాహ్మణలను అవమానించేలా సన్నివేశాలున్నాయంటూ కొంత కాలంగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే..దీనిలో భాగంగానే బుధవారం రాత్రి మోహన్‌ బాబు ఇంటా వద్దా ఆందోళన నిర్వహించారు. అంతే అదేదో పాపమైనట్లు విష్ణు తన ప్రైవేటు సైన్యాన్ని వారిపై ఉసిగొల్పాడు..దీంతో రెచ్చిపోయిన వారు దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఒక్కొక్కరి చుట్టూ కొంతమంది కిందపడేసి మరీ చితక్కొట్టారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి..వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.
కావాలనే దుష్ప్రచారం: విష్ణు
తమపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విష్ణు అన్నారు. దీని వెనక కొందరి కుట్ర ఉందని, వివరాలు త్వరలోనే భయట పెడతానని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *