
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం ఎర్రగడ్డ స్మశానవాటికలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తిచేశారు. వి.బి.రాజేంద్రప్రసాద్ అంతిమయాత్రలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, సినీ అభిమానులు పాల్గొని కన్నీటి నివాళులర్పించారు. తీవ్ర అనారోగ్యానికి గురై నగరంలోని ఈషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.




