హైదరాబాద్ జనం సాక్షి: దివంగత సంగీత దర్శకుడు చక్రి కుటుంబ వివాదం రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేషీకి చేరింది. ఇవాళ చక్రి తల్లి, సోదరుడు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తమ కుటుంబ తగాదాను మంత్రికి వివరించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఇటీవలే చక్రి ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలిసిందే.




