Tuesday, 3 November 2026

వి లవ్ యూ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరగిన వ్యర్థ అవగాహన సదస్సు..

సికింద్రాబాద్సీ / జనం సాక్షి )    సితాఫలమండి లో
వి లవ్ యూ ఫౌండేషన్ వారు ప్రజలలో రోడ్లపై చెత్త,వ్యర్థ పదార్థాలు వేయకుండా అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించరు.  డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి  మాట్లాడుతూ ఫౌండేషన్  చేస్తున్న కార్యక్రమాలు స్వచ్ఛందంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయం అని కొనియాడారు.  అనంతరం కార్పొరేటర్ సామల హేమ మాట్లాడుతూ సితఫలమండి డివిజన్ ను ఎంపిక చేసినందుకు
వి లవ్ యూ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ప్రజలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం ఒక గొప్ప విషయం అని రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేపట్టడం నిజంగా అభినందనయం వారికి మేము అండగా ఉంటూ ప్రజల్లో అవగాహన సదస్సు వారితో పాటు మేము కూడా పాల్గొంటాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి లవ్ యూ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ నరేష్,మంజుల,అరుణ  సభ్యులు తదితరులు పాల్గొన్నారు