తేలుతున్న శవాలు …దొరకని బ్లాక్‌బాక్స్
జకారా,జనవరి3 (జనంసాక్షి): జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియాకు చెందిన రెండు భారీ శకలాలను గత అర్థరాత్రి గుర్తించినట్లు ఇండోనేసియా ఉన్నతాధికారి శనివారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. సముద్రంలో దాదాపు 90 విూటర్ల అడుగు భాగంలో వీటిని గుర్తించినట్లు తెలిపారు. వాటిని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.గత ఆదివారం 162 మంది ప్రయాణికులతో ఇండోనేసియాలోని రెండో అతిపెద్ద నగరం సురబయ్య నుంచి సింగపూర్ బయలుదేరిన విమానం జావా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 162 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో 155 మంది ప్రయాణికులు కాగా, ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 30 మృతదేహాలను సముద్రం నుంచి వెలికితీశారు. విమానం కూలిపోయిన రోజున వాతావరణం బాగా లేదని ఇండోనేషియా వాతావరణ శాఖ పేర్కొంది. బ్లాక్‌బాక్స్‌లు వెలికితీస్తే ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించవచ్చని ఇండోనేషియా అధికారవర్గాలు తెలిపాయి.
వీడని ఎయిర్ ఏషియా మిస్టరీ





