వెస్టిండీస్‌ టార్గెట్‌ 409

క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా 408 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. డివిలియర్స్‌(162) చెలరేగడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. అంతకుముందు హషీమ్‌ ఆమ్లా(65), డుప్లెసిస్‌(62) అర్ధసెంచరీలు సాధించి భారీస్కోరుకు బాటలు వేశారు. సౌతాఫ్రికా 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసింది.