యువకుడి మృతి
హైదరాబాద్,ఆగస్ట్28 (జనంసాక్షి): వేగంగా బైక్ నడిపిన యువకుడు అదుపు తప్పి, వైడర్‌ను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల
ప్రకారం.. మాదాపూర్ పర్వత్‌నగర్‌కు చెందిన కశిరెడ్డి సుబ్బారెడ్డి కుమారుడు మాధవ్(17) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సోమవారం స్నేహితుడి పుట్టిన రోజు కావడంతో కేకు తీసుకురావడం కోసం రాత్రి 9గంటల ప్రాంతంలో బైక్‌పై మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బయలుదేరాడు. వేగంగా వెళ్లడంతో, మార్గమధ్యలో డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న మాధవ్‌రెడ్డి తీవ్ర గాయాలతో, అక్కడికక్కడే మృతి చెందగా, అతని స్నేహితులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. అతివేగమే అతని ప్రాణం తీసిందని, హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలతో ఉండే వాడని పోలీసులు పేర్కొన్నారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో అతని తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొన్న బైక్




