వేడుకగా మంత్రి అఖిలప్రియ నిశ్చితార్థం
– హాజరైన ప్రముఖులు
– ఆగస్టు 29న జరగనున్న వివాహం
హైదరాబాద్, మే12(జనం సాక్షి ) : ఆంధప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం శనివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈ వేడుకను నిర్వహించారు. మాజీ డీజీపీ సాంబశివ రావు అల్లుడు, పారిశ్రామిక వేత్త భార్గవ్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ శుభకార్యంలో కుటుంబ సభ్యులతోపాటు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరి వివాహం ఆగస్టు 29న జరగనుంది. గత కొంతకాలంగా అఖిలప్రియ, భార్గవ్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. తన తల్లిదండ్రులు శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలను కోల్పోయిన తర్వాత అఖిల ప్రియ అనూహ్య పరిస్థితుల మధ్య రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం ఆమె ఏపీ పర్యాటకశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.