
– రాజయ్య,దయాకర్, గాలి వినోద్‌ల నామినేషన్లు దాఖలు
వరంగల్ నవంబర్2(జనంసాక్షి):
వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పసునూరి దయాకర్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య, వామపక్షాలు బలపరిచిన స్వతంత్య్ర అభ్యర్థి ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఆలాగే స్వతంత్య్ర అభ్యర్థిగా సండ్ర జాన్సన్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల అభ్యర్థుల వెంట ముఖ్య నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి దయాకర్ నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, డాక్టర్ టి. రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్‌లు పాల్గొనా, కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య నామినేషన్ మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ప్రభుత్వ చీప్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డిలు బలపరిచారు. వీరివెంట మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, డిసిసిఅధ్యక్షుడు నాయినిరాజేందర్‌రెడ్డి ఉన్నారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కలెక్టరేట్‌కు ముఖ్య నాయకులతో కలిసి రాగా వామపక్షాలు బలపరిచిన స్వతంత్య్ర అభ్యర్థి ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ భారీ ర్యాలీతో తరలి వచ్చారు. వినోద్‌కుమార్ నామినేషన్ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, ఎంసిపిఐ(యు) నాయకులు సింగతి సాంబయ్య, సామాజిక వేదిక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఉన్నారు.
మార్కెట్‌లో దళారులదే రాజ్యం.




