వేడెక్కిన హుజూరాబాద్ రాజకీయం
ఈటెలను ఢీకొనేందుకు గెల్లును దింపిన కెసిఆర్
విద్యార్థి నాయకుడి పేరును ఖరారు చేసిన గులాబీ బాస్
హైదరాబాద్/కరీంనగర్,ఆగస్ట్11( జనం సాక్షి):హుజురాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో ప్రధాన పార్టీలు బీజీగా ఉన్నాయి. ఉపఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్‌ఎస్ నియోజక వర్గంలో ప్రచారం ఊదరగొడుతోంది. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇంచార్జ్‌లను నియమించి గ్రౌండ్ వర్క్ చాలారోజుల కిందటే మొదలుపెట్టేసింది.ఇకపోతే తమ పార్టీ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సిఎం కెసిఆర్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ పార్టీలో యువ నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. దళిత బంధు ప్రారంభ సమావేశం
సందర్భంగా ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ పరిచయం చేయనున్నారు. హుజూరాబాద్ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు గులాబీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన గెల్లు మల్లయ్య, లక్ష్మీ దంపతులకు శ్రీనివాస్ యాదవ్.. 1983, ఆగస్టు 21న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఇదే యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇంటర్ వరకు కరీంనగర్ జిల్లాలోనే చదివిన శ్రీనివాస్.. ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వచ్చారు. గగన్ మహల్‌లోని ఏవీ కాలేజీలో బీఏ చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. అంబర్‌పేటలోని ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. 2003 నుంచి 2006 వరకు హాస్టల్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ కాలంలో బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో కేసీఆర్ ప్రసంగాలకు ఆకర్షితుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ఆయనకు మద్దతుగా పని చేశారు. ఈ క్రమంలో ఏవీ కాలేజీలో టీఆర్‌ఎస్వీ అధ్యక్షులుగా (2003`06) గెల్లు కొనసాగారు. 2003`04 విద్యాసంవత్సరంలో బీసీ విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్ కోసం ఇందిరా పార్కులో అప్పటి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. బొమ్మెర రామ్మూర్తి, బాబా ఫసీయుద్దీన్ నాయకత్వంలో హైదరాబాద్ టీఆర్‌ఎస్వీ పట్టణ కార్యదర్శిగా శ్రీనివాస్ యాదవ్ పనిచేశారు. 2010లో ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్‌ను బాల్క సుమన్ నియమించారు. 2017 నుండి టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నారు.
2010, జనవరిలో తెలంగాణ విద్యార్థి మహా పాదయాత్రలో భాగంగా.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓయూ నుంచి కాకతీయ యూనివర్సిటీ విూదుగా 650 కిలోవిూటర్లు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో వేల మంది విద్యార్థులను భాగస్వాములను చేయడంలో విజయం సాధించారు. 2010 హుజురాబాద్ ఉప ఎన్నికలో స్టూడెంట్ ఇంచార్జిగా బస్సు యాత్రలో పనిచేశారు. 2011, మార్చిలో మౌలాలి రైల్వే స్టేషన్లలో 48 గంటల రైల్ రొకో కార్యక్రమాన్ని వందలాది విద్యార్థులతో కలిసి కేటీఆర్ నాయకత్వంలో విజయవంతం చేశారు. 2011, మార్చి 10న నిర్వహించిన మిలియన్ మార్చ్‌లో టీఆర్‌ఎస్వీ తరపున భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై 100కు పైగా కేసులు నమోదు అయ్యాయి. 2001 నుండి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలకపాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో రెండుసార్లు జైలుకు వెళ్లిన.. శ్రీనివాస్ చర్లపల్లి సెంట్రల్ జైలులో 36 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. 2004 డిసెంబర్‌లో విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ నాటి ఆర్థిక మంత్రి రోశయ్య ఇళ్ళు ముట్టడికి ధర్నా నిర్వహించి అరెస్టు అయ్యారు. 2006 సెప్టెంబర్‌లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో లగడపాటి రాజగోపాల్‌కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు జరిపిన నిరసన ర్యాలీలో అరెస్ట్ అయ్యారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ తండ్రి గెల్లు మల్లయ్య వీణవంక మండల స్థాయిలో 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషించారు. గెల్లు మల్లయ్యఅఖిల భారత యాదవ మహాసభ కన్వీనర్‌గా, కొండపాక ఎంపీటీసీగా సేవలందించారు. జిల్లా యాదవ సహకార సంస్థ డైరెక్టర్ గా ఎన్నుకోబడ్డారు. మల్లయ్య 2004 నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ తల్లి లక్ష్మీ హిమ్మత్ నగర్ గ్రామ సర్పంచ్ గా సేవలందించారు.