హైదరాబాద్,జనవరి19(జనంసాక్షి): నగరంలో వేర్వేరు చోట్ల స్వల్ప అగ్నిప్రామదాలు చోటుచేసుకున్నాయి.
నగరంలోని మొజాంజాహీ మార్కెట్ వద్ద ఎలక్టాన్రిక్ క్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. లింగోజీగూడ గౌతమినగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పేపర్ రోల్, దారాల గోదాంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకుని సమాగ్రి మొత్తం కాలిపోయింది. మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. భారీగా ఆస్థి నష్టం జరిగింది. టపచబుత్ర పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాళ్లగడ్డ దర్గా వద్ద ఆకతాయిలు నిలిపి ఉన్న ప్రైవేటు బస్సుకు నిప్పు పెట్టారు. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది.




