హైదరాబాద్,నవంబర్21(జనంసాక్షి): వేలిముద్రలను క్లోనింగ్ చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుల నుంచి క్లోనింగ్ వేలిముద్రలు తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నామని సీపీ అంజనీ కుమార్ బుధవారం వెల్లడించారు. ఒక్కో వేలిముద్రకు రూ.4వేలు చొప్పున నిందితులు వసూలు చేస్తున్నారు. వివేకానంద విద్యాసంస్థల్లో 28 మంది అధ్యాపకుల వేలిముద్రలు క్లోనింగ్ చేసినట్లు తేలిందని తెలిపారు. వివేకానంద విద్యాసంస్థల కార్యదర్శి గోపాల్‌రెడ్డి పరారీలో ఉన్నారని సీపీ వివరించారు. జేఎన్‌టీయూ సహకారంతో దర్యాప్తును ముమ్మరం చేస్తామని ఆయన తెలిపారు. బొమ్మ రామకృష్ణ, శ్రీరామ్ ప్రసాద్, సుదర్శన్‌రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.3లక్షల నగదు, 2 బయోమెట్రిక్ మెషిన్లు, గ్లూ గన్, 30 గ్లూ స్టిక్స్, 60 క్లోన్‌డ్ ఫింగర్ ప్రింట్స్ స్వాధీనం చేసుకున్నారు.




