Saturday, 7 November 2026

హైదరాబాద్‌ చేరుకున్న జైరామ్‌ రమేశ్‌

 

రేవంత్‌ నివాసంలో చర్చలు

హైదరాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్‌ బుధవారం హైదరాబాద్‌ వచ్చారు. ఈనేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. జైరాంకు పుష్పగుచ్చం ఇచ్చి రేవంత్‌ ఆహ్వానించారు. ఎన్నికలు, ప్రచారంపై సమాలోచనలు జరిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ వైపు అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక రేవంత్‌రెడ్డి కూడా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ… సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే జైరాం రమేష్‌… రేవంత్‌ రెడ్డి నివాసానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. 23న సోనియా రానున్న నేపథ్యంలో బహిరంగ సభ నిర్వహణపైనా వీరు చర్చించారని సమాచారం. తాజాగా ఎంపి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మొదలు పలుఉవరు టిఆర్‌ఎస్‌ నేతుల కాంగ్రెస్‌లో చేరడంపైనా చర్చించారని తెలుస్తోంది. కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా బలం పుంజుకుంటోందన్నారు. అదే సమయంలో ఎన్డీయే తన మిత్ర పక్షాలను కోల్పోతోందన్నారు. ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్‌ మార్గదర్శి అని చంద్రబాబు అన్నారని, పరిస్థితులు ఆ విధంగా రూపుదిద్దుకుంటాయని చెప్పారు. జాతీయ స్థాయిలో ఎన్డీయేకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతాయని తెలిపారు.