Thursday, 5 November 2026

వైకాపాకు అధికారమే లక్ష్యంగా పనిచేయాలి: నాని

ఏలూరు,మే9(జ‌నం సాక్షి): 2019లో వైసిపి అధికారమే లక్ష్యంగా పనిచేయాలని ఆళ్ళనాని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపుడి మండలంలో వైసిపి పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా వైసిపి జిల్లా అధ్యక్షులు ఆళ్ళనాని, ప్రధాన కార్యదర్శి గంటా మురళి, చింతలపూడి కన్వీనర్‌ ఏలిషా పాల్గన్నారు. మే 14 నుంచి జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్రను జయప్రదం చేయాలని, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.