వైకాపాకు ఆళ్ల నాని రాజీనామా
వ్యక్తిగత కారణాలని వివరణ
ఏలూరు,ఆగస్ట్17 (జనం సాక్షి): మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైఎస్ జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. గతంలో పార్టీ పదవులకు మాత్రమే రాజీనామా చేసిన ఆళ్ల నాని.. ఇప్పుడు ఏకంగా పార్టీకే రిజైన్ చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు ఆళ్ల నాని ప్రకటించారు. ఇదే విషయమై ఆళ్ల నాని విూడియాతో మాట్లాడారు.. గతంలో పార్టీ పదవులకు, ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అప్పుడు, ఇప్పుడూ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. ఏలూరులో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసినట్లు నాని తెలిపారు. కార్యాలయ స్థలం లీజు ముగిసిందని.. దాంతో స్థలాన్ని యజమానికి అప్పగించామన్నారు. స్థల యజమాని అనుమతితోనే కార్యాలయంలో స్వాతంత్య దినోత్సవ వేడుకలు నిర్వహించామని చెప్పారు. ఆ తరువాతే పార్టీ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను కూల్చివేశామని ఆళ్ల నాని చెప్పుకొచ్చారు.