వైకాపాకు టిడిపిని విమర్శించే అర్హత లేదు

అమరావతి,జూలై19(వైకాపాకు టిడిపిని విమర్శించే అర్హత లేదు): యుద్ధరంగం నుంచి పారిపోయిన వైకాపాకు తెదేపాను విమర్శించే హక్కు లేదని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. మోదీని విమర్శించాల్సి వస్తుందనే వైకాపా ఎంపీలు రాజీనామాలు చేశారని ఆరోపించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెరాస భాజపాకు అనుకూలంగా ఉందనే ప్రచారం గత కొంతకాలంగా ఉందని, కానీ భాజపా కాంగ్రెస్‌లకు తమ పార్టీ వ్యతిరేకమని తెరాస నేతలు చెప్పుకుంటున్నారన్నారు. భాజపా విషయంలో తెరాస సానుకూలంగా ఉందన్నారు. తెదేపాను దెబ్బ కొట్టడానికి భాజపా రకరకాల ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. అందులో భాగంగానే తెరాస ఈ రకమైన వైఖరితో ఉందని భావిస్తున్నట్టు చెప్పారు.

 

తాజావార్తలు