Friday, 6 November 2026

వైజాగ్‌ టెక్‌ సదస్సు స్ఫూర్తిగా మిగలనుంది: గంటా

విశాఖపట్టణం,నవంబర్‌17(జ‌నంసాక్షి): వైజాగ్‌డిక్లరేషన్‌ ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేస్తుందని ఏపీ మంత్రి

గంటాశ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో జరిగిన టెక్‌ సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో విజేతగా నిలిచిన కృష్ణకావేరీకి ఆయన బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా వైజాగ్‌ డిక్లరేషన్‌ ప్రకటన విడుదల చేశారు. ఈ సదస్సు వల్ల ప్రపంచవ్యాప్తంగా విద్యాశిక్షణ, బోధన పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందన్నారు. విశాఖలోనే టెక్‌-19 కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.