హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అద్యక్షుడు, కడప పార్లమేంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికార కాంగ్రెసు పార్టీ పైన మరో అస్త్రం దొరికింది..! కాంగ్రెసు పార్టీలో ఇమడలేక బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించిన వైయస్ జగన్ ఆ తర్వాత ఆస్తుల కేసులా ఊబిలో చిక్కుకుపోయి అరెస్టయ్యారు. గత ఏడాది మే 27వ తేదిన ఆరెస్టయిన జగన్ ఇప్పటికి జైలులోనే ఉన్నారు. ఆయన పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికి రాలేదు.
ఏప్రిల్ నెలలో బెయిల్ పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే,తన ఆస్తులపై కేసులు, ఆరెస్టు ఇదంతా కాంగ్రెసు కుట్రలో భాగమేనని జగన్ పార్టీ మొదటి నుండి ఆరోపిస్తుంది. జగన్ ఎప్పుడైతే పార్టీని వీడారో అప్పటి నుండే అధికార కాంగ్రెసు పార్టీ ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. జగన్ పార్టీ వీడాకే ఆయన ఆస్తులపై సిబిఐ కేసులంటు ఆరెస్టు చేసిందంటున్నారు. కాంగ్రెసు పార్టీలొ ఉన్నప్పుడు ఎందుకు ఈ తరహా చర్యలకు పూనుకోలేదని ప్రశ్నిస్తూన్నారు.
అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపణలను అధికార పార్టీ తీవ్రంగా ఖండాస్తూ వస్తోంది. సిబిఐ విచారణలో తమకు ఎలాంటి సంబంధం లేదని చేబుతూ వస్తోంది. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి డిఎంకె రూపంలో మరో ఆయుధం దోరికినట్లుగా అయింది. యూపిఏ ప్రభుత్వానికి డిఎంకె మద్దతు ఉపసంహరించిన తర్వాత రోజే ఆ పార్టీ నేత స్టాలీన్ నివాసం పైన సిబిఐ సోదాలు ప్రారంభించింది. అధికార పార్టీ పాత్ర పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విదేశి లగ్జరీ కార్టను అక్రమంగా దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ సోధాలు చేస్తున్నారు. డిఎంకె మద్దతు ఉపసంహరించినందు వల్లే స్టాలీన్ పైన కాంగ్రెసు కక్ష సాధింపు చర్యలలో భాగంగా సోదాలు చేయిస్తోందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇవి జగన్ పార్టీకి మరో ఆయుధంగా మారయనే చెప్పవచ్చు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉన్న వారిపై ఆ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడంతో రాష్ట్రంలో దానిని ప్రచారం చేసుకునే వీలు జగన్ పార్టీకి కలిగిందంటున్నారు. ఇది వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కలిసి వచ్చే ఆవకాశమే ఆని చెబుతున్నారు.




