వైసీపీ ఎమ్మెల్యేలకి లోకేష్ ట్విట్టర్లో కౌంటర్
విజయవాడ(జనం సాక్షి ): వైసీపీ ఎమ్మెల్యేల ఆరోపణలపై మంత్రి లోకేష్ కౌంటరిచ్చారు. తమ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదన్న, వైసీపీ ఎమ్మెల్యేల ఆరోపణలపై లోకేష్ ట్విట్టర్లో కౌంటరిచ్చారు. అంతేకాదు వైసీపీ ఆరోపణలపై ఆయన ఫ్యాక్ట్ షీట్ విడుదల చేశారు.‘‘మీపై నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని కొన్ని నియోజకవర్గాల్లో గెలిపించారు. కానీ మీరు ప్రజలకు తిరిగి ఏం ఇచ్చారు?. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అడిగింది లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకొని అన్ని సౌకర్యాలు పొందుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలను పట్టించుకోకపోయినా.. మేం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం’’ అని లోకేష్ ట్విట్టర్లో చెప్పారు.