Tuesday, 3 November 2026

వ్యక్తిత్వ వికాసంలో భాష కీలకపాత్ర పోషిస్తుంది: మోదీ

0lnltj5g
హైదరాబాద్‌: వ్యక్తిత్వ వికాసంలో భాష కీలకపాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మధ్య ఆసియా పర్యటనలో భాగంగా ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో హిందీ విద్యార్థులు, భారతీయులతో ప్రధాని మోదీ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉజ్బెకిస్థాన్‌లో భారతీయ భాషలు, సినిమాలు, సంగీతం ఖ్యాతి చెందాయన్నారు. 50 ఏళ్లపాటు ఉజ్బెకిస్థాన్‌ రేడియోలో హిందీ ప్రసారాలు జరగటం గొప్ప విషయమన్నారు. ఆందోళనల నుంచి స్వేచ్ఛ లభించాలంటే సంగీతం మంచి మార్గమని… మనిషి హింసామార్గం వైపు వెళ్లకుండా సంగీతం నిరోధిస్తుందన్నారు. భాషను పరీక్షిస్తే… దాని హృదం చాలా విశాలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. దేశాల మధ్య సాంస్కృతిక బంధం కూడా చాలా ముఖ్యమని వివరించారు. ఉజ్బెకిస్థాన్‌ పర్యటన ఫలప్రదంగా ఉందని మోదీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *