చిత్తూరు,నవంబర్13(జనంసాక్షి):: మదనపల్లి ప్రశాంత్ నగర్ దగ్గర్లోని జ్ఞానోదయ హై స్కూల్ గ్రౌండ్‌లో మంగళవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. జ్ఞానోదయ హై స్కూల్ గ్రౌండ్ విూదుగా మోటార్
బైక్‌పై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వెంబడించారు. బైక్‌పై ఉన్న వ్యక్తిని ఆ నలుగురు వ్యక్తులు కలిసి అతి దారుణంగా గాయపరిచారు. స్థానికులు గమనించడంతో నలుగురు వ్యక్తులు పరారయ్యారు. గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.




