Wednesday, 4 November 2026

17న తెలంగాణ బంద్‌

బిసిలకు అన్యాయం జరిగిందన్న కృష్ణయ్య

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): మహా కూటమిలో అసంతృప్త సెగలు చల్లారడం లేదు. ఆశించిన టికెట్లు ఇవ్వలేదని ఆశావహులు ఓ వైపు నిరసనలు వ్యక్తం చేస్తుంటే.. జాబితాలో బిసి లకు అన్యాయం జరిగిందని బిసి సంఘం నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన 65 మందిలో కేవలం 13 మందే బిసి లు ఉన్నారని ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. సీట్ల కేటాయింపులో బిసి లకు అన్యాయం జరిగిందన్న ఆయన కాంగ్రెస్‌ తీరును నిరసిస్తూ ఈ నెల 17 తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.