వ్యభిచార ముఠా గుట్టురట్టు

విజయవాడ,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): అమాయక మహిళలను మోసగించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యభిచార ముఠా గుట్టు బుధవారం వెలుగు చూసింది. ఓ యువతి సోషల్‌ విూడియాలో తన ఫోటోను చూసి కృష్ణలంకపోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసుల దర్యాప్తులో వ్యభిచార ముఠా వివరాలు వెల్లడయ్యాయి. అమాయక మహిళలను మోసగించి వారి ఫోటోలను సోషల్‌ విూడియాలో పెట్టి, తమ అకౌంట్లలో డబ్బులు వేయించుకుని మాయం చేస్తున్నారని, ఇప్పటివరకూ రూ.20 లక్షలకు పైగా వసూళ్లు చేశారని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ముఠాకు సంబంధించిన రాజేశ్వరి అనే నిందితురాలితో సహా మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

——————

తాజావార్తలు